స్థానిక ఎన్నికల్లో అభివృధి పనులే మనకు శ్రీరామరక్ష: కేఈ ప్రతాప్

931చూసినవారు
స్థానిక ఎన్నికల్లో అభివృధి పనులే మనకు శ్రీరామరక్ష: కేఈ ప్రతాప్
టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే వల్లే స్థానిక సంస్థలు, మున్సిపల్​ ఎన్నికల్లో గెలుస్తామని ఆ పార్టీ నేత కేఈ. ప్రతాప్ ధీమా వక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లా డోన్​లో టిడిపి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. వైసీపీ అధికారం చేపట్టి 9 నెలలు అయిన ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. గ్రామాలలో ఓట్లు ఆడిగేటప్పుడు వైకాపా వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశంను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్