బేతంచెర్ల మండలంలోని ఆర్ ఎస్ రంగాపురం గ్రామంలోని ప్రకృతి పాఠశాల 7వ తరగతి విద్యార్థిని రమ్య, అబాకస్ పరీక్షలో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల కరస్పాండెంట్ రవికుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం కర్నూలులో నిర్వహించిన జిల్లా స్థాయి అబాకస్ పరీక్షలో సీనియర్ విభాగంలో రమ్య 2వ బహుమతి సాధించిందని ఆయన తెలిపారు.