డోన్ లో పేదలకు, అనాధలకు అన్నదానం 300 మందికి పైగా గుత్తి రోడ్ లోని రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. నడిమింటి నందీష్ స్వర్గీయులై రెండు సంవత్సరాలు అయిన వారి జ్ఞాపకాన్ని మరువలేని కుటుంబ సభ్యులు ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో నందీష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.