కళ్యాణదుర్గం: ఆరోగ్యశ్రీ పథకం కింద తుంటి ఆపరేషన్ విజయవంతం

69చూసినవారు
కళ్యాణదుర్గం: ఆరోగ్యశ్రీ పథకం కింద తుంటి ఆపరేషన్ విజయవంతం
కళ్యాణదుర్గం పట్టణంలోని కిషోర్ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద 'తుంటి' ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు డాక్టర్ సాయికిషోర్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా మోకాళ్లు, తుంటి, ఇతర కీళ్లకు సంబంధించిన ఆపరేషన్ల కోసం పెద్ద నగరాలకు వెళ్తుంటారని, ఆ సేవలను ఆరోగ్యశ్రీ పథకం కింద కళ్యాణదుర్గంలోని తమ ఆసుపత్రిలోనే విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్