రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
కోడుమూరు నియోజకవర్గంలోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ వద్ద ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలులో కలెక్టర్ మాట్లాడారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు.