గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదుగురు వ్యక్తులు కలిసి యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు. బాపూనగర్‌లో నివాసముంటున్న 19 ఏళ్ల యువకుడికి స్థానికులకు మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఐదుగురు దుండగులు కలిసి ఒకరి తర్వాత ఒకరు కలిసి ఆ యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.