AP: నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కేంద్రంతో అంతర్గతంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్టీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాల ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయని, ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు.