సి. బెళగల్ మండలంలోని గ్రామాల్లో ఆదివారం రైతులు పత్తి విత్తనాలను నాటే పనులను ముమ్మరం చేశారు. గత 20 రోజులగా మండల వ్యాప్తంగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో పొలాలు కొంతమేర విత్తనాలు నాటుకునేందుకు పదునయ్యాయి. తేలికపాటి వర్షానికి తడి పదును కావడంతో సి. బెళగల్, ఇనగండ్ల, చింతమానుపల్లె, గుండ్రేవుల తదితర గ్రామాల్లోని రైతులు పత్తి విత్తనాలను కూలీలతో నాటించుకున్నారు.