కోడుమూరులో నెలరోజుల తర్వాత భారీ వర్షం

76చూసినవారు
కోడుమూరు పట్టణంలో నెలరోజుల తర్వాత శుక్రవారం భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో వర్షం కురియడంతో పట్టణంలోని వీధులు జలమయమయ్యాయి. మెయిన్ బజార్, తేరుబజార్, మునిమంద, మోమిన్ వీధుల్లో మోకాటి లోతుకుపైగా వాననీరు ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. జూన్ 1న ఖరీఫ్ సీజనల్ ప్రారంభం అవ్వగా అప్పట్లో వర్షాలు అనుకూలంగానే కురిశాయి. జూన్ 12వ తేదీన వర్షం కురిశాక వరుణుడు మొఖం చాటేశాడు.

సంబంధిత పోస్ట్