కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. శుక్రవారం గూడూరుకు చెందిన 18వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కలామాబాషాతో కో-ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలులో టీడీపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సమక్షంలో వారు టీడీపీలో చేరారు. వైసీపీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు లేదని, అభివృద్ధి పనులకు ఆకర్షితులమై టీడీపీలో చేరినట్లు తెలిపారు.