కోడుమూరు పట్టణానికి చెందిన రామ గోవిందు, వరలక్ష్మి కొత్తూరు-కోడుమూరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై గురువారం స్పందించిన కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోడుమూరు హాస్పిటల్లోని మార్చురీని సందర్శించి, మృతదేహాలకు నివాళులర్పించారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి గోవింద్ దంపతుల మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు.