వృద్ధాశ్రమాల ఏర్పాటు, నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

53చూసినవారు
వృద్ధాశ్రమాల ఏర్పాటు, నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కర్నూలు జిల్లాలో వృద్ధాశ్రమాల ఏర్పాటు, నిర్వహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో కోరారు. రిజిస్ట్రేషన్ ధృవ పత్రం కోసం రూ. 100 డీడీ లేదా క్రాస్ చేసిన చెక్కును సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విజయవాడ పేరిట తీసి ఫారం 'ఎం' లో వివరాలను పొందుపరచాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్