రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవస్వామి కోరారు. బుధవారం కోడుమూరులో వారు మాట్లాడారు. చేనేత రంగ సమస్యలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ మహాత్ముడి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో చేనేత సంఘం స్థానిక నాయకులు మహబూబ్ బాషా, నరసింహులు, నాగరాజు ఉన్నారు.