రాష్ట్ర ప్రభుత్వం అధునాతన టెస్టింగ్ యంత్రాల ద్వారా పరీక్షలను నిర్వహించి నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటోందని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కాంప్లెక్స్ లో ఉన్న రీజినల్ ఎక్సైజ్ లేబరేటరీని కలెక్టర్ సందర్శించారు. కొత్తగా వచ్చిన టెస్టింగ్ మిషినరీ, ఇన్స్ట్రుమెంట్ తో జరుగుతున్న పరీక్షలు, టెస్టింగ్ పద్ధతుల పనితీరును పరిశీలించారు.