గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనాథ్ బీఎల్వోలకు ఆదేశించారు. గురువారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన వారి నుండి ఫారం - 6 తీసుకోవాలని, డెత్ కేసులను ఓటరు జాబితా నుండి తొలగించాలని సూచించారు. అలాగే డబుల్ ఎంట్రీపై విచారణ చేయాలని కోరారు.