గుర్తు తెలియని మృతదేహం లభ్యం

73చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నది సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు మంత్రాలయం ఎస్ఐ గోపినాథ్ సోమవారం విలేకరులకు తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 50 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మృతి చెందిన వ్యక్తి ఎరుపురంగు అంగీ , లుంగీ ధరించినట్లు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్