పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో ఏపీసీఎన్ఎఫ్, రిలయన్స్ ఫౌండేషన్ భీమేష్ ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు రసాయనిక మందులు వదిలి ప్రకృతి వ్యవసాయం వైపు నిలవాలని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన భూమిని, ప్రకృతి నీ అందించాలని అన్నారు. ఈ క్రమంలో అనిల్ రైతులకు అజ్ఞాస్త్రం తయారు చేసి పంటకు పేనుబంక, జిగి, పచ్ఛదోమల నుండి నివారణకు ఉపయోగపడుతుంది అని వివరించారు.