అగసనూరు గ్రామంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి త్రాగునీరు పైపులైన్ పనుల భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీరు కోసం కష్టపడుతున్న ప్రజల కష్టాలను ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి గుర్తించి, జిల్లా పరిషత్ నిధులతో తుంగభద్ర నది నుండి నూతన పైపులైను వేసి త్రాగునీరు అందించారు.