తుంగభద్ర నదికి పోటెత్తిన వరద నీటితో నది తీర ప్రాంతాల్లోని పంట పోలాలు పూర్తిగా నిండిపోయాయి. ఈవిషయన్ని రైతులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మురళీ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా మురళీమోహన్ రెడ్డితో పాటు మండల వ్యవసాయ అధికారి రాజు వెంటనే నది తీర పంట ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు. శుక్రవారం తుమ్మిగనూరు, సాతనూరు, అగసనూరు, కందుకూరు పోలాల్లో మురళీరెడ్డి, బెట్టనగౌడ్, ఏఓ రాజు లు పర్యటించారు.