మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథక కింద పనిచేస్తున్న కూలీల సంఖ్యను పెంచడానికి ఉపాధిహామీ సిబ్బంది కృషి చేయాలని కోసిగి వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి అన్నారు. మేజర్ గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంటుగా పెండేకంటి లోకరెడ్డి నూతనంగా విధులకు చేరిన నేపథ్యంలో ఎంపీపీ ఈరన్నతో పాటు మురళీరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మురళీరెడ్డి, ఈరన్నలకు శాలువా కప్పి గజమాలతో సత్కరించారు.