కోసిగి మండల పరిధి జంపాపురం గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధిపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భీమేష్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వంతో పాటు రైతులు అందరూ ఏకమై గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని కోరారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు ముఖ్య అంశాలు గురించి చర్చించి గ్రామానికి అవసరమగు సరైన నిర్ణయాలు తీసుకొని తోడ్పడాలని అన్నారు.