మంత్రాలయం: అక్రమంగా తరలిస్తున్న 300బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని.. ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం గ్రామానికి చెందిన శ్రీరాములు, బేతంచెర్ల చెందిన హరి రాజు హుస్సేన్ వలి అనే వ్యక్తులు మంత్రాలయంలో కాలేజ్ రోడ్డు సమీపంలో లారీలో 300 బస్తాల ప్లాస్టిక్ సంచుల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా సిబ్బందితో వెళ్లి దాడులు చేసి పట్టుకున్నామన్నారు.