కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్నస్వామిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. శనివారం కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయానికి దర్శనార్థం చేరుకున్న మంత్రి టీజీ భరత్ కు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.