మంత్రాలయం నియోజకవర్గంలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు అండగా ఉంటామని, ఎవరు అధైర్య పడవద్దని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మంత్రాలయంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పర్యటించి ప్రజలకు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు.