వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రాలయం మండలంలోని చిలకలడోణలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.