తుంగభద్ర నదిలో నీరు వృధా కాకుండా ప్రాజెక్టులకు అందించాలి

1188చూసినవారు
తుంగభద్ర నదిలో నీరు వృధా కాకుండా ప్రాజెక్టులకు అందించాలి
కోసిగి లో ప్రాజెక్టులను నీటితో నింపి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిపిఐ అనుబంధ సంస్థ అయిన ఏపీ రైతు సంఘం జిల్లా సమితి పిలుపు మేరకు సచివాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. రైతుసంఘం అధ్యక్షులు తాలూకా గోపాల్ మాట్లాడుతూ కోసిగిలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు త్రాగు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్