కొత్తపల్లి గ్రామాలలో ప్రజలు గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలని ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ ఎం. కేశవ బుధవారం సూచించారు. మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో సీఐ సురేష్ కుమార్ రెడ్డి, బావాపురం గ్రామంలో ఎస్ఐ కేశవ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు శాంతిని ప్రతి రూపాలన్నారు. అలాంటి గ్రామాల్లో ప్రజలు గొడవలకు, అల్లర్లకు, ఘర్షణలకు దూరంగా ఉండాలన్నారు.