రైతులకు పెట్టుబడి సహాయం కింద 20000 వేలు తక్షణమే ఇవ్వాలని, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పగిడ్యాల మండలo తాసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. తహసీల్దార్ శివ రాముడు కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాటపోగు సోమన్న, బి. రామకృష్ణ, ఎస్. మా భాష, అన్వర్ భాష, లక్ష్మాపురం సామేలు తదితరులు పాల్గొన్నారు.