కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. వివరాలలోకి వెళితే.. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానిక ఎన్.జి.ఓ.కాలనీలో విషాదం నింపింది. మృతుడు రవితేజ ఇంట్లో బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడ్డాడు.
నంద్యాల పట్టణంలోని ఎన్.జి.ఓ.కాలనీలో నివాసం ఉండే హెడ్ కానిస్టేబుల్ లక్షీనారాయణకు రవితేజ ఒక్కగానొక్క కొడుకు. రవితేజ బీటెక్ వరకు చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం రాక గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపం చెందుతుండే వాడని రవితేజ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని బెడ్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని అత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు రవితేజ మృతి చెందాడు. తండ్రి లక్షీ నారాయణ ఫిర్యాదు మేరకు టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.