సగర సేవా సంఘం వనభోజనాలకు ఆలమూరు గ్రామస్తులకు ప్రత్యేక ఆహ్వానం పలికినట్లు సేవా సంఘం సభ్యులు బుధవారం తెలిపారు. గ్రామంలో సగర కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని, సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందు ఉంటారని తెలిపారు. గ్రామ పెద్దలు ఉప్పరి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వనభోజన ఆహ్వాన కరపత్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వనభోజన మహోత్సవాలకు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సభ్యులు కోరారు.