నంద్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసిందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డిప్పు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రోహిబిషన్, ఎక్సైజ్ జిల్లా అధికారి రవికుమార్, ఏఎస్పి తదితరులు పాల్గొన్నారు.