ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై ఆలూరు నియోజకవర్గం వైస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం హొళగుందలో జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్కె గిరి, మండల కన్వీనర్ సఫియుల్లా మాట్లాడారు. డీఆర్సీ సమావేశంలో సమస్యలపై చర్చిస్తున్న ఎమ్మెల్యే విరుపాక్షిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో ఆదోని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.