ఉపాధి హామీ పనుల లేబర్ బడ్జెట్, ఇళ్ల నిర్మాణాల పురోగతి, పంట నష్ట నమోదు, ఈ క్రాప్ బుకింగ్, ఓడిఎఫ్ ప్లస్ సర్వే తదితర అంశాలలో నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్రస్థాయి అధికారులు తక్కువ ప్రగతి సాధిస్తున్నారని ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా అని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.