కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషనన్ ను అమరావతికి తరలించే ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే, ఆందోళనలు ఉధృతం చేస్తామని కర్నూలు జిల్లా న్యాయవాదులు హెచ్చరించారు. బుధవారం కర్నూలులో వారు మాట్లాడారు. ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు ఉపక్రమించాలని, ప్రస్తుతం కర్నూలులో పనిచేస్తున్న లోకాయుక్త, హెచ్ఆర్సీను తరలించొద్దని డిమాండ్ చేశారు.