నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సమావేశం అయ్యారు. అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం అని కలెక్టర్ ఎంపీ సమాలోచన చేశారు.