నంద్యాల: ఇంటర్ లో ఫెయిల్. మనస్థాపంతో మరో విద్యార్థి సూసైడ్

84చూసినవారు
నంద్యాల: ఇంటర్ లో ఫెయిల్. మనస్థాపంతో మరో విద్యార్థి సూసైడ్
నంద్యాల జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురైన బండి ఆత్మకూరుకు చెందిన మస్తాన్ అనే విద్యార్థి బొమ్మలసత్రం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం విడుదలై ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి తండ్రి మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్ మోహన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్