ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను వితిన్ ఎస్ఎల్ ఏ లోగా పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.