రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన అవగాహనాత్మక చర్చా కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నిర్వహించారు. విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన ఆసక్తికర విషయాలు, సైబర్ నేరాలు, శిశు కార్మిక వ్యతిరేకం, సాంకేతికత వినియోగం, అవినీతి నిర్మూలన, మహిళల వేధింపులు వంటి అంశాలపై ఎస్పీ విద్యార్థులతో చర్చించి వివరించారు.