మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎన్సిసి తోడ్పాటునందిస్తుందని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జోబి ఫిలిప్ గురువారం అన్నారు. నంద్యాల రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ మహిళా విద్యార్థినులకు ఎన్సిసి ఎన్రోల్మెంట్ సెలక్షన్స్ నిర్వహించారు. కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. మేజర్ ప్రియ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కర్నూలు హాజరయ్యారు. విద్యార్థులు పాల్గొన్నారు.