నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెసరవాయి పోలీసు ఫ్యాక్షన్ పికెట్ ను గడివేముల సబ్ ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డి ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెసరవాయి గ్రామంలోని పరిస్థితులపై సిబ్బంది అడిగి తెలుసుకుని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.