నంద్యాలలో ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సుధాకర్, కె. కుమార్ శనివారం సమావేశం నిర్వహించారు. డిసెంబర్ నెల ప్రారంభమై 9 రోజులు గడుస్తున్న ఉపాధ్యాయులకు నవంబర్ నెల జీతాలు ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రతి నెల 7 తేదీ నుండి 15 వ తేదీ వరకు చెల్లించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించలేకపోవడం ప్రభుత్వం అసమర్థత క్రిందకు వస్తుందన్నారు.