నంద్యాల: వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి

57చూసినవారు
నంద్యాలలోని వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు శుక్రవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ కమీషనర్ స్పందించి వీధి కుక్కల నియంత్రణపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని శుక్రవారం కోరారు. నంద్యాల పట్టణంలో దాదాపుగా 5 వేల నుండి 6వేల వీధి కుక్కలున్నాయని, కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలన్నారు.

సంబంధిత పోస్ట్