భారతదేశానికి రాజ్యాంగమే లేకుంటే వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉండేదని ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్, కుమార్ లు అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ఎస్టీటీఎఫ్ కార్యాలయంలో అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగం వలనే మనం రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నామని కనుక మనం రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావించాలన్నారు.