రోకలి బండతో బాది తల్లిని చంపిన కొడుకు
పాణ్యం మండలం వడ్డుగండ్ల గ్రామంలో కన్న కొడుకే తల్లిని కడతేర్చిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. మహేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిసై మతిస్తిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో గురువారం తల్లి నాగలక్ష్మమ్మ(58)ను రోకలితో తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పాణ్యం సీఐ నల్లప్ప, ఎస్సై అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.