పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు ఎంత మేర పూర్తి అయ్యాయి, ఇంకా చేయాల్సిన ఏమున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల వివరాలు, రైతులకు చెల్లించిన పరిహారం వాటిపై ఆరా తీశారు. ఆర్డీవో విశ్వనాధ్, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు.