విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం పాణ్యం మండలం మద్దూరులో మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉందని, గ్రామంలో ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను గుర్తించి నమోదు చేయించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులు, టీచర్లను ఆదేశించారు.