పత్తికొండలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

763చూసినవారు
పత్తికొండలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం
పత్తికొండలో స్థానిక తేరుబజార్, ముస్లిం వీధి, ఉప్పర వీధిలో ఆదివారం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన గృహాలకు సీఎం జగన్ స్టిక్కర్ ను అతికించారు. గడపగడపకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ జిలాన్, రసూల్, వార్డ్ మెంబర్ మొహమ్మద్, ఫక్రుద్దీన్ రహంతుల్లా జెండామన్ ముజీబ్, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్