టీడీపీలోని ఇరువర్గాలు వెల్దుర్తి మండలం మల్లెపల్లెలో పరస్పరం దాడి చేసుకున్నాయి. శేఖర్ గౌడ్ వర్గం, దుర్గనాయుడు వర్గానికి ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల విషయంలో వివాదం ఏర్పడింది. శేఖర్ గౌడ్ వర్గం దుర్గనాయుడు ఇళ్లపై దాడి చేసి గాయాలపాలైంది. ప్రత్యర్థి వర్గం శేఖర్ గౌడ్ వర్గీయుల ఇళ్లపై దాడి చేసి బైకులు, వాకిళ్లు ధ్వంసం చేశారు. ఆదివారం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.