శ్రీ చౌడేశ్వరీ దేవి ఉత్సవ విగ్రహం ఊరేగింపు

63చూసినవారు
శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలను పురస్కరించుకుని పత్తికొండ పట్టణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సోమవారం ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఊరేగింపు నిర్వహించారు. విగ్రహానికి ప్రతి ఇంటి వద్ద టెంకాయలు పూలు పండ్లు అగర్బత్తీలు సమర్పించారు. శ్రీ చౌడేశ్వరి దేవి భక్తులు ఉత్సవ విగ్రహ ఊరేగింపులో పాల్గొన్నారు. మాల పౌర్ణమికి చౌడేశ్వరి దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్