
మహానంది: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
మహానంది మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన షేక్ అల్తాఫ్ అనే వ్యక్తి కనపడడం లేదని ఆయన భార్య ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్సై ఎన్. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 11 -11-2024 నుండి ఆటో నడుపుటకు వెళుతున్నాని చెప్పి కనపడటం లేదని అతని భార్య ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.